ఎమ్మెల్యేగా అనసూయ
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ యాంకర్ అనసూయ. అందులో భాగంగా క్షణం, రంగస్థలంలాంటి చిత్రాల్లో తన నటనతతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర బయోపిక్‌లో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె కర్నూల్ ఎమ్మెల్యే చరితారెడ్డి పాత్రలో కనిపించనుందట. పాదయాత్ర సమయంలో 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజకవర్గం నుండి పోటీచేసి చరితారెడ్డి ఏ విధంగా గెలిచింది. పార్టీకోసం ఆమె కష్టపడిన తీరును అనసూయ పాత్ర ద్వారా సినిమాలో చూపించనున్నారు. ఇక చిత్రంలో అనసూయ డీగ్లా మారైజ్డ్గా కనిపించనుంది. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగుతోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది.













