Ananya Pandey: డిజైనర్ లెహంగాలో మరింత అందంగా అనన్య
సెలబ్రిటీలు ఈ మధ్య సోషల్ మీడియాలో తమ అప్డేట్స్ ను రెగ్యులర్ గా అందిస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్లకు ట్రీటిస్తూ టచ్ లోనే ఉంటున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే(Ananya pandey) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రీన్ మరియు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లెహంగాలో అనన్యా పాండే ఎంతో అందంగా కనిపించింది. భూమికా శర్మ( Bhumika Sharma) డిజైన్ చేసిన ఈ లెహంగాలో అనన్య మరింత అందంగా కనిపించడంతో పాటూ ఆ లెహంగాపై ఉన్న వైట్ కలర్ ఎంబ్రాయిడరీ చాలా డిఫరెంట్ గా ఉంటూనే అందరినీ ఆకట్టుకుంది.







