12న దొరసాని రానుంది
ఆనంద్ దేవరకొండ, శివాత్మకలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దొరసాని. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆనంద్ దేవరకొండ, శివాత్మక ఈ మూవీలోని చిన్నయి పాడిన పట..కళ్లల్లో కలవరమైన సాంగ్‌ను రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఇప్పటికే నింగిలోన పాలపుంత.. నవ్వులొంపెనే సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఒక స్వచ్చమైన ప్రమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. దొరసానిలో పాటలు కథలో భాగంగా ఉంటాయాన్నారు. శివాత్మక మాట్లాడుతూ పాట చాలా బాగా పిక్చరైజ్ చేశారని, ఈ పాట ప్రేమకథలోని ఎమోషన్స్‌ను చూపేలా దర్శకుడు మహేంద్రగారు ఎంతో కృషి చేశారన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పరిచయం కానుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.













