Anaganaga Oka Raju: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి హిట్ సినిమా
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజవగా వాటిలో రాజా సాబ్(raja saab) మినహాయించి మిగిలిన అన్ని సినిమాలూ బాగానే పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ నుంచి మంచి టాక్ తో పాటూ బాక్సాఫీస వద్ద కలెక్షన్లను కూడా అందుకున్నాయి. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నవీన్ పోలిశెట్టి(naveen polishetty) అనగనగా ఒక రాజు(anaganaga oka raju) సినిమా కూడా ఒకటి.
మారి(maari) దర్శకత్వంలో నవీన్ హీరోగా, మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ టాక్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడీ సినిమా థియేట్రికల్ రన్ ను ముగించుకుని ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ఫ్లిక్స్(Netflix) అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 11 నుంచి అనగనగా ఒక రాజు స్ట్రీమింగ్ కు రానుందని, పాన్ ఇండియా స్థాయిలో ఈ ఓటీటీ రిలీజ్ జరగనుందని తెలిపింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి.













