Amyra Dastur: ఇంతందం ఎలా సాధ్యమనేలా మైమరపిస్తున్న అమైరా
మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అమైరా దస్తూర్(Amyra dastur) ఎప్పటికప్పుడు తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమైరా ఇన్‌స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే అమైరా తాజాగా ఎల్లో కలర్ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. శారీకి తగ్గట్టు స్లీవ్ లెస్ బ్లౌజ్, హెయిర్ స్టైల్ తో మరింత అందంగా మెరిసింది అమైరా. అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతూ చీరకట్టులో కూడా ఇంతందమెలా సాధ్యమని కామెంట్స్ పెడుతున్నారు.







