చేతిలో సినిమాల్లేవ్… టాలీవుడ్ లో చేయడానికి రెడీ అంటున్న అమీజాక్సన్
ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు వుంది అమీజాక్సన్ పరిస్థితి. అత్యంత భారీ చిత్రాలైన ‘ఐ’ ‘2.ఓ’లలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా నటించిన ఈ బ్రిటిష్ బ్యూటీ చేతిలో సినిమాలు లేక తెలుగు చిత్రాల వైపు మొగ్గు చూపుతుంది. అక్కడ తమిళ్ లో మదరాసు పట్టణం తో పరిచయం అయిన ఈ హాట్ సుందరి శంకర్ దర్శకత్వం లో ‘ఐ’ 2.ఓ చిత్రాలతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. ఈమె తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్లో ఏక్ దీవానా థా, ఫ్రీకీ ఆలీ లో యాక్ట్ చేసింది. ఇక్కడ వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు కలిసి నటించిన ఎవడు చిత్రంలో ఈమె నటించి మెప్పించింది. మూడో చిత్రంగా తమిళంలో తాండవం అనే మూవీలో నటించిన ఈమె ఇదే సమయంలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ఐ లో హీరోయిన్ పాత్రను పోషించింది. ఈ చిత్రంతో తన సుడి తిరుగుతుందని భావించింది. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం సరిగా ఆడలేదు. ఎన్నో అంచనాల మద్య విడుదలైన ఐ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
బాలీవుడ్లో సింగ్ ఈజ్ బ్లింగ్, తూతక్ తూతక్ తూతియా వంటి చిత్రాలతో పాటు తమిళంలో తంగా మగన్, గీతు, తేరీ, దేవి, తెలుగులో అభినేత్రి చిత్రంలో ఓ ఐటం సాంగ్, కన్నడలో ది విలన్, తమిళంలో మరోసారి శంకర్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రజనీకాంత్ చిత్రం 2.0 వంటి చిత్రాలలో యాక్ట్ చేసినా, ఇవేమీ పెద్దగా ఘనవిజయం సాధించలేదు. రెండు సార్లు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించినా ఈమెకి అదృష్టం కలిసి రాలేదు. అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తొందరపడి మరీ పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అవకాశం మిస్సయితే మరలా దొరకదు అనే తరహా తొందరలో పడి పెళ్లికి ముందుగానే గర్భం ధరించి కక్కుర్తి పడే హీరోయిన్లకు సినిమా రంగంలో కొదువు ఉండదు. ఇక ఈ కోవలోకి తాజాగా చేరిన నటి అమీజాక్సన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ బ్రిటీష్ బ్యూటీ బ్రిటన్ కి చెందిన బోయ్ ఫ్రెండ్‌తో కమిట్ అయి ప్రెగ్నెన్సీ ధరించి, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే తన బోయ్ ఫ్రెండ్ కమ్ మోడల్, యాక్టర్ అయిన జార్జ్ పనాయొటో తో డేటింగ్ చేసింది. 26 ఏళ్లకే పెళ్లి కాకుండా తల్లి అయింది. ఈ బ్రిటీష్ బ్యూటీ బ్రిటన్ కి చెందిన బోయ్ ఫ్రెండ్‌తో కలిసి బ్రిటిష్ బుద్ది చూపుతూ పిల్లలు కనడానికి, తల్లి కావడానికి పెళ్లే అవసరం లేదని మరీ నిరూపించింది. అమీ తన బోయ్ ఫ్రెండ్‌తో కమిట్ అయిన తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ ఇప్పటికీ ఈమెకి దీనికి ముందు పెళ్లి అనేది ఒకటుందనే విషయం గుర్తుకు వచ్చినట్లుగా లేదు. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక సినిమాల పరంగా ఈమె కెరీర్ ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అమీ జాక్సన్ చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అందాల ఆరబోతకు ఎందుకు వెనుకాడదు? తన పర్సనల్ ఫొటోలు, వీడియోలతో నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే అమీ జాక్సన్ తన బోయ్ ఫ్రెండ్ ని గతేడాదే వివాహం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇక ఏం చేయాలో తెలియక ఈమె తన బోయ్ ఫ్రెండ్ జార్జ్ పనయిటోతో సహజీవనం చేస్తూ ప్రస్తుతం తన బోయ్ ఫ్రెండ్, పిల్లలతో కలిసి ఉంటోన్న అమీ జాక్సన్ త్వరలో మరలా సినిమాలు చేయడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో తన అదృష్టాన్ని బాగానే పరీక్షించుకున్న అమీ ఇకపై తెలుగులో నటించడానికి సిద్దమవుతోందిట. ఎప్పటి నుంచో తెలుగులో వరుస చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నా.. ఈమెకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదట. అందునా తెలుగులో ప్రస్తుతం సీనియర్ స్టార్లకు తీవ్రమైన హీరోయిన్ల కొరత ఉంది. ఇప్పటికే విక్రమ్, రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ల సరసన నటించిన అమీ జాక్సన్‌కి తెలుగులో సీనియర్ స్టార్ల సరసన నటించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక ఇప్పుడైనా తనకి తెలుగులో మంచి అవకాశాలు వస్తే తనని తాను నిరూపించుకుంటానని ఈమె అంటోంది. లాక్ డౌన్ పూర్తయ్యేలోపు తెలుగులో ఒక్క చిత్రంలో అయినా అవకాశం రాకుండా పోతుందా? అనే ఆశతో అమీ జాక్సన్ ఉంది. చూడాలి మరి.. తెలుగులో ఈమెకి ఎవరైనా అవకాశం ఇస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి..













