పెళ్లి కాలేదు… కానీ తల్లి అయ్యారు
ప్రముఖ కథానాయకి అమీ జాక్సన్ తల్లి కాబోతోంది. ఒక హీరోయిన్ మాతృమూర్తి అవుతుండడం వార్తలకెక్కడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ, అమీ జాక్సన్ పెళ్లికి ముందే తల్లి అవుతుండడంతో ఒకింత సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటున్నామంటే.. అమీకి ఇంకా పెళ్లి కాకపోవచ్చు. కానీ ఆమెకు పోయిన జవనరిలో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్కు ముందు నుంచే తన ప్రియుడు జార్జ్తో సహ జీవనం చేస్తున్న అమీ.. తాను తల్లి కాబోతున్నానని స్వయంగా ప్రకటించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నాని తెలిపింది. పాపో, బాబో పుట్టాక..అప్పుడు ఆ బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.













