అమృతనిలయం ఫస్ట్‌లుక్ విడుదల
అను ఫిలింస్ పతాకంపై రాజా విక్రమ్ నరేంద్ర దర్శకత్వంలో రామమోహన్ నాగుల-ప్రవీణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అమృతనిలయం. విజయ్, మమత, రిషి, బేబి సుహాన, సతీష్, లడ్డు, తేజస్విని ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను అపరాజిత సేవాసమితిలోని అనాధ బాలబాలికల చేతుల మీదుగా విడుదల చేశారు. అనాధగా మారిన ఓ అంధుని కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ సన్నాహాలు చేసుకుంటోంది. ఆలోచింపజేస్తూనే అలరించే అంశాలతో రూపొందుతున్న అమృతనిలయం మంచి విజయం సాధించి, తమ అను ఫిలింస్‌కి చక్కని శుభారంభాన్నిస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి కంకణాల, కథ-మాటలు: రవి నాయక్, మ్యూజిక్: రామ్, నిర్మాతలు: రామమోమన్ నాగుల-ప్రవీణ్‌కుమార్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాజా విక్రమ నరేంద్ర.













