రామ్ సరసన అమృత అయ్యర్ …
ముగ్గురు కథానాయికలతో కలిసి సందడి చేయబోతున్నారు రామ్. ఆయన హీరోగా రెడ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకుడు. తమిళ చిత్రం తడమ్ కి రీమేక్ ఇది. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే నివేదా పేతురాజ్, మాళవిక శర్మని ఎంపిక చేసుకున్నారు. తాజాగా మూడో నాయికగా అమృత అయ్యర్ ఖాయమైంది. తమిళ హీరో విజయ్ నటించిన విజిల్ లో పుట్బాల్ కెప్టెన్గా కనిపించి ఆకట్టుకుంది అమృత. రెండ్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.













