Amitabh: ఇండియాలోనే ఎక్కువ ఛార్జ్ చేస్తున్న అమితాబ్

ఎంతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్(Amithab Bachan) కు విపరీతమైన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే ఆయనకు రెమ్యూనరేషన్ కూడా భారీగా ముట్టచెప్తుంటారు నిర్మాతలు. అయితే అమితాబ్ కేవలం యాక్టర్ గానే కాకుండా టీవీ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్‌పతి(Kaun Banega Karodpathi) అనే క్విజ్ షో మొదలైనప్పటి నుంచి దానికి ఆయనే హోస్ట్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 17వ సీజన్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈసారి సీజన్ కు అమితాబ్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కోసం అమితాబ్ రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని, అంటే వారానికి 5 రోజుల చొప్పున మొత్తం రూ.25 కోట్లు తీసుకోబోతున్నారని తాజా నివేదికలంటున్నాయి.
గతంలో వీకెండ్ కా వార్ షో కోసం సల్మాన్ ఖాన్(Salman Khan) వారానికి రూ.24 కోట్లు తీసుకోగా ఇప్పుడు సల్మాన్ ను దాటి మరీ అమితాబ్ టాప్ కు వెళ్లడం విశేషం. ఇది నిజమైతే ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీససుకుంటున్న టీవీ హోస్ట్ గా అమితాబ్ కు రికార్డు దక్కుతుంది. హోస్టింగ్ లో అపార అనుభవం ఉన్న అమితాబ్ కు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడం ఎక్కువేమీ కాదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.