బిగ్ బీకి దాదా సాహెబ్ ఫాల్కే
బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్ (76) కీర్తికిరీటంలో మరో కలికితురాయి. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా బాలీవుడ్ సినీ ప్రియులను ఉర్రూతలూగించి నాలుగు దశాబ్దాల కెరీర్లో తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షహెన్ షా ను దేశంలోనే అత్యునత్న సినీ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. రెండు తరాలకు వినోదం అందించి, స్ఫూర్తినిచ్చిన లెజెండ్ అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కానికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. యూవద్భారతదేశం, అంతర్జాతీయ సమాజం సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు.













