అమితాబ్ బచ్చన్‌కు ఇపీ పురస్కారం
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గోవాలో జరగనున్న అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (ఇఫీ) లో ఈ ఏడాది వ్యక్తిత్వ అవార్డును ఇవ్వనున్నట్లు సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల కెరీర్ కాలంలో దాదాపు 190 భారతీయ సినిమాల్లో నటించారు. ఆయన ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు పొందారు. గోవాలో నవంబర్ 20 నుంచి 28 మధ్య జరిగే చిత్రోత్సవంలో ఆయనకు ఈ విశిష్ట అవార్డును ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయ భారత ఫిలిం ఫెస్టివల్ (ఇఫీ)ని 1952లో నెలకొల్పారు. ఆసియాలో ఇదో ప్రతిష్టాత్మక చిత్రోత్సవంగా పరిగణిస్తారు.













