అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 77 ఏళ్ల అమితాబ్ ఈ అవార్డ్ అందుకొన్నారు. ఈ కార్యక్రమానికి జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి గత వారం జరిగిన చలనచిత్ర జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అమితాబ్ పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన హాజరు కాలేక పోయారు. అవార్డుల విజేతలకు రాష్ట్రపతిభవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేయడంతో ఈ సందర్భంగా అమితాబ్‌కు ఫాల్కే అవార్డ్ అందజేశారు. పాల్కే అవార్డ్ నాకు ప్రకటించారనే వార్త తెలియనగానే నాకో సందేహం కలిగింది. ఇక నటన చాలించి ఇంటిపట్టున కూర్చుని రెస్ట్ తీసుకో అనే సంకేతాన్ని ఈ అవార్డ్ ఇస్తోందా? అనిపించింది. అయితే ఇంకా నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అందుకే ఈ విషయమై నాకు వివరణ కావాలి అని అవార్డ్ స్వీకరించిన అనంతరం ట్వీట్ చేశారు అమితాబ్.
దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించండం చాలా ఆనందంగా ఫీలవుతున్నాను అని అమితాబ్ పేర్కొన్నారు.













