కరోనా టీకా తీసుకున్న అమితాబ్ బచ్చన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు సినీ సెలెబ్రీటీస్ కరోనా తీకా తీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ పూర్తయిందని తెలిపారు. సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే తీసుకుంటానని గత నెలలో అమితాబ్ ప్రకటించిన విషయం విదితమే. గతేడాది బిగ్ బీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఒక్క అభిషేక్ తప్పా ఇంట్లో అందరూ కరోనా టీకా తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ ప్రస్తుతం షూటింగ్ లోకేషన్‍లో ఉండడంతో ఆయన టీకా తీసుకోలేకపోయారు.