అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యాయ్ కు ఈడీ సమన్లు
అమితాబ్, ఐశ్వర్యారాయ్ కు ఈడీ సమన్లు
పనమా పేపర్స్ ఆరోపణలపై నిజానిజాల వెలికితీత
విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో డబ్బు తరలించారని ఆరోపణలు
బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు, స్టార్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో వీరి విచారణ జరగనుంది. విదేశాల్లో పేపర్ (నకిలీ) కంపెనీల్లో ఆస్తులు పెట్టుబడులు పెట్టారని, వాటి పేరుతో కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని పనామా పేపర్లు ఆరోపించాయి. వీటిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఈడీ విభాగం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అమితాబ్, ఐశ్వర్య విచారణ జరగనుంది.













