Ameesha Patel: అమీషా ఫిట్నెస్కి ఫిదా అవుతున్న నెటిజన్లు
బద్రి(Badri) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా పటేల్(Ameesha Patel) తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే కంటిన్యూ అయింది. అమీషా వయసు ఐదు పదులకు చేరువైనప్పటికీ అమ్మడు పాతికేళ్ల భామలకు పోటీ అనేట్లు అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తోంది. తాజాగా టైట్ షార్ట్ వేసుకుని స్పోర్ట్స్ బ్రా లో మెరిసిన అమీషా పటేల్ ను చూసి ఈ ఏజ్ లో ఇంత ఫిట్‌గా ఎలా ఉందంటూ షాకవుతున్నారు. అమీషా పటేల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













