Ameesha Patel: సల్మాన్- రష్మిక ఏజ్ గ్యాప్ పై స్పందించిన హీరోయిన్
ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ విషయంలో ఎప్పుడూ ఏదొక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ విషయంలో డిస్కషన్స్ కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదొక జంట ఈ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi), మహేష్ బాబు(Mahesh babu), రవితేజ(Ravi Teja), బాలకృష్ణ(Balakrishna) ఈ వివాదాలను ఎదుర్కొనగా రీసెంట్ గా సల్మాన్ ఖాన్(Salman khan) ఈ వివాదంలో చిక్కుకున్నారు.
మురుగదాస్(murugadoss) దర్శకత్వంలో సల్మాన్ హీరోగా వచ్చిన సికిందర్(Sikandar) లో రష్మికతో కలిసి నటించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. తనకంటే 31 ఏళ్లు చిన్నదైన రష్మికతో ఆయన ఎలా నటిస్తారని అందరూ సల్మాన్ ను ప్రశ్నిస్తుండగా ఈ విషయంలో తాజాగా హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel) స్పందించారు. హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ అనేది మ్యాటరే కాదని ఆమె చాలా సింపుల్ గా చెప్పేసింది.
గతంలో తాను కూడా వయసులో ఎంతో పెద్ద హీరోలతో కలిసి వర్క్ చేశానని, గదర్2(Gadhar2) లో తనకంటే 20 ఏళ్లు పెద్దైన సన్నీ డియోల్(Sunny Deol) పక్కన నటించానని, ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ అందరికీ విపరీతంగా నచ్చిందని, ఆడియన్స్ కూడా తమ కెమిస్ట్రీకి ఫిదా అయారని చెప్పింది. తాను సికిందర్ మూవీ చూశానని, సినిమాలో రష్మిక(Rashmika Mandanna), సల్మాన్ జంట ఎంతో బావుందని, సికిందర్ లో కంటెంట్ ఉంది కాబట్టే ఆ సినిమాను ఆడియన్స్ ఆదరిస్తున్నారని అమీషా పటేల్ తెలిపింది.













