అమీర్ పేట్ టు అమెరికా ట్రైలర్ విaడుదల
తేజస్, పల్లవి, వంశీకృష్ణ, శషాసింగ్, వంశీ కోడూరి, మేఘన కీలక పాత్రధారులుగా రాధా మీడియా బ్యానర్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం అమీర్పేట టు అమెరికా. రామ్మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకులు. పద్మజ కొమండూరి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్ను తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అమీర్ పేట్ టు అమెరికా ప్రయాణాన్నంతా ఈ సినిమాలో చూపించారు. ఇందులో చక్కని పాత్రను పోషించా అన్నారు. రామ్మోహన్ కొమండూరి మాట్లాడుతూ అమీర్ పేట నుంచి అమెరికా వెళ్లే వారి లైఫ్ స్వర్గంలా అనిపిస్తుంది. కానీ అక్కడ డాలర్ సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఆ ఇతివృత్తంతోనే ఈ సినిమా తీశాం. ఈ నెల 23న పాటల్ని విడుదల చేసి, 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.













