సుహాస్ కు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
ఈ మధ్య సినిమాలకు రిలీజ్ డేట్స్ సెట్ చేసుకోవడం చాలా పెద్ద పనిగా మారింది. అదే చిన్న హీరోల సినిమాలైతే ఆ తలనొప్పి నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఎన్నో రోజుల కిందటే టీజర్ ను రిలీజ్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ లవ్ స్టోరీ కోసం సుహాస్ నిజంగా గుండు కొట్టించుకుని మరీ ఆడియన్స్ కు షాక్ ఇవ్వబోతున్ఆనడు. అయితే ఈ సినిమాకు ఓ సెంటిమెంట్ కలిసొస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న రైటర్ పద్మభూషణ్ ను రిలీజ్ చేసిన సుహాస్ కు ఆ సినిమాతో మంచి సక్సెస్ దక్కింది. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు మళ్లీ అదే టైమ్ లో తన మూవీ రిలీజ్ కావడం యాదృచ్ఛికమే అయినా కొన్నిసార్లు ఇవే సెంటిమెంట్ గా మారతాయి. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో శివానీ హీరోయిన్గా నటిస్తోంది. సెలూన్ లో పని చేసే కుర్రాడు ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే పరిస్థితులను చాలా విభిన్నమైన నేపథ్యంతో చెప్పబోతున్నాడు. మరి ఈ సినిమాకు సుహాస్ సెంటిమెంట్ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.













