సాయి పల్లవి సెలెక్షన్ సూపరంటున్న డైరెక్టర్
సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తో తండేల్ సినిమాతో పాటూగా అమరన్ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. కమల్ హాసన్ నిర్మాతగా సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని డైరెక్టర్ రాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాయి పల్లవి, శివ కార్తికేయన్ల మధ్య కొన్ని కీలకమైన సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వచ్చిన సినిమా అవుట్‌పుట్‌పై కమల్ హాసన్ ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు డైరెక్టర్ తెలిపాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె మూవీ సెలక్షన్ సూపర్ ఉంటుందని చెప్పిన రాజ్, సాయి పల్లవి కష్టమైన సీన్స్ లో కూడా చాలా ఈజీగా నటించేస్తుందని తెలిపాడు. అంతేకాదు ప్రతీ సీన్ ను సాయి పల్లవి స్టడీ చేస్తుందని, సీన్ కు ముందేంటి తర్వాతేంటనేది కూడా అడిగి తెలుసుకుంటుందని తెలిపాడు. ఇక మేకప్, డ్రెస్సింగ్ విషయంలో ఆమె జెట్ స్పీడ్ గా ఉంటోందని డైరెక్టర్ రాజ్ కుమార్ వెల్లడించాడు. ఈ సినిమా ఇండియన్ మిలటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతుంది.













