D55: అమరన్ డైరెక్టర్ మరోసారి అలాంటి కథతోనే!
అమరన్(Amaran)0 సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి(Raj kumar Periyaswamy). రీసెంట్ గా ఆయన తన తర్వాతి సినిమాను ధనుష్ తో మొదలుపెట్టాడు. ధనుష్(Dhanush) కెరీర్ లో 55వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఏ నేపథ్యంలో తెరకెక్కనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ధనుష్ సినిమా కూడా అమరన్ లానే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
సమాజంలో ఎందోర రియల్ లైఫ్ హీరోలున్నారని, వారి కథలను సినిమాగా చేస్తే అద్భుతాలు చేయొచ్చని గతంలో రాజ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే డీ55(D55) కూడా రియల్ స్టోరీ ఆధారంగానే తెరకెక్కుతుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతుందని, నిజ జీవితంలో ఓ క్రైమ్ విచారణ ఆధారంగానే సినిమాను తీస్తున్నారని వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాలో ధనుష్ కొత్తగా రొటీన్ లుక్ కు భిన్నంగా కనిపిస్తారని, సినిమాలో ఆయన పాత్ర వాస్తవ పాత్రను గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో శృతి హాసన్(Shruthi Hassan) ఓ డిఫరెంట్ పాత్రలో నటించనుందని, ఇప్పటివరకు శృతి కెరీర్లో అలాంటి పాత్ర చేయలేదని, డైరెక్టర్ ఆ పాత్ర గురించి చెప్పుకుండానే శృతి ఓకే చెప్పిందని సమాచారం.













