అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ లుక్ విడుదల
మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ఇలియానా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై మెరవనుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రీసెంట్గా విడుదల చేశారు. ‘అమర్ అక్బర్ అంటోని’ ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. ప్రీ-లుక్ తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా అనే హింట్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచిన ‘అమర్ అక్బర్ అంటోని’ టీమ్ ఇప్పుడు మాస్ మహారాజా మూడు అవతారాలను రివీల్ చేసింది.













