‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం ప్రారంభం
మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముహూర్త సన్నివేశానికి శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది క్లాప్‌నివ్వగా, చిన్న కుమార్తె ఆద్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇందులో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. రవితేజ స్క్రిప్ట్ అందించగా, శ్రీనువైట్ల తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం మార్చి 22 నుండి యూఎస్‌లో షూటింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్నట్టు తెలుస్తుంది.













