బలగం కాదు…బలం కావాలి
రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడింటినీ టీజర్లో హైలెట్ చేశారు దర్శకుడు శ్రీనువైట్ల. టీజర్ చాలా కొత్తగా, సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. మనం ఆపదలో ఉన్నపుడు మనల్నికాపాడేది మన చుట్టు ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. ముగింపు రాసుకున్న తర్వాతే ఆరంభించాలి.. అనే డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అమెరికాలో అందమైన లోకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రీనువైట్ల. ఈ సినిమాలో లయ, సునీల, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ ప్రధానపాత్రధారులు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్ 16న, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.













