29న అమర్ అక్బర్ ఆంటోని టీజర్ విడుదల
రవితేజ నటిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశారు. టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలో జరిగింది. సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రంలో ఇంకా లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్, ఛాయగ్రహణం వెంకట్ సి.దిలీప్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థఈ సినిమా నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, వైరవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలు.













