న్యూయార్క్ లో అమర్ అక్బర్ అంటోనీ షూటింగ్
రవితేజ హీరోగా శ్రీనవైట్ల అమర్ అక్బర్ అంటోని సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ఐ లాండ్లోని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ బంగళాలో జరుగుతోందని శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. తన ఆరధ్య దేవత గతంలో నివసించిన బంగళాలో షూటింగ్ చేయటం తనకి అనిర్వచనీయమైన అనుభూతిని కల్గిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. హాలీవుడ్ స్టార్, పాప్సింగర్గా జెన్నిఫర్ లోపేజ్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. కొట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె గతంలో ఈబంగాళాలో నివాసం ఉండేది. అక్కడ షూటింగ్ చేస్తున్న శ్రీనువైట్ల తన సంతోషాన్ని అబిమనులతో పంచుకున్నారు.













