Dokka Seethamma: తెరపైకి డొక్కా సీతమ్మ జీవిత కథ
అన్ని దానాల్లోకంటే అన్నదానం గొప్పదని, ఆకలి బాధ కు కులం, మతం, చిన్నా పెద్దా తేడా ఉండదని, అందరికీ ఆ బాధ సమానమేనని అంటూ ఉంటారు. ఆకలితో ఉన్న ఎంతో మందికి ఆకలిని తీర్చి ఉభయగోదావరి జిల్లాల్లో నిత్యం అన్నదానం చేసే దాతగా పేరు తెచ్చుకుని ఆంధ్రుల అన్నపూర్ణగా ఫేమస్ అయిన డొక్కా సీతమ్మ(Dokka Seethamma) కథను ఇప్పుడు సినిమాగా తీయబోతున్నారు.
ఎంతో మందికి ఆకలిని తీర్చి చాలా మందికి ఆదర్శంగా నిలిచిన డొక్కా సీతమ్మ పాత్రలో సీనియర్ నటి ఆమని(Amani) నటించడనుండగా, రవి నారాయణ్(Ravi Narayan) ఈ మూవీని రూపొందిస్తున్నారు. అంతే కాదు, ఈ సినిమా ద్వారా వచ్చిన ప్రతీ రూపాయినీ డొక్కా సీతమ్మ పేరుపై ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల కోసం విరాళంగా ఇస్తామని కూడా తెలిపారు.
అసలు డొక్కా సీతమ్మ ఎవరు? ఆమె అన్నదానం చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఆంధ్ర అన్నపూర్ణగా ఆమె ఎలా ఫేమస్ అయ్యారు? బ్రిటీష్ దొర ఆమెకు చేతులెత్తి నమస్కరించేంత గొప్పగా ఆమె ఎలా ప్రసిద్ధి చెందారనే అంశాలను సినిమాలో చూపించనున్నారు. డొక్కా సీతమ్మ లాంటి గొప్ప గొప్ప కథలు సినిమాలుగా తెరకెక్కితే తర్వాతి తరాలకు ఆమె చేసిన సేవలు ఆదర్శప్రాయంగా ఉండే అవకాశముంది.













