రెండో పెళ్లి ఇప్పట్లో ఉండదు
సినీ రంగంలో కొన్ని ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవవు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు మనస్పర్థల మూలంగా విడిపోతుంటాయి. అలాగే హీరోయిన్ అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్‌ల ప్రేమ వివాహం కొన్నాళ్లకే మనస్పర్థలతో విడాకులకు దారితీసింది. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఓవైపు అమలాపాల్ హీరోయిన్గా బిజీ అవుతుండగా మరోవైపు దర్శకుడిగా విజయ్ వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా అమలాపాల్ తన రెండో పెళ్లిపై క్లారీటీ ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకోను అని చెప్పను కానీ రెండవ పెళ్లి ఇప్పట్లో ఉండదని మాత్రం చెప్పగలను అని పేర్కొంది. మొదటి పెళ్లి కోసం కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వెళ్లాను. అప్పుడు అంతా అనుకున్నట్లుగా జరుగలేదు. మొదటి వివాహం సక్సెస్ కాలేదు. అందుకే రెండవ పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత, నిర్ణయాధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చాను అని అమలాపాల్ తెలియజేసింది.













