అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నా
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, జయం రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పాపులర్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. మనకి ఆఫర్ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము. పొన్నియిన్ సెల్వన్ లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు అమలా పాల్.













