Allu Sneha Reddy: వైట్ గౌను లో అల్లు వారి కోడలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భార్యగా, బిజినెస్ మ్యాగ్నెట్ గా అల్లు స్నేహా రెడ్డి(Allu Sneha Reddy) అందరికీ సుపరిచితురాలే. అటు ఫ్యామిలీ లైఫ్ ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను సరిగ్గా డీల్ చేస్తున్న స్నేహా రెడ్డి ప్రస్తుతం పారిస్ లో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహా తాజా వైట్ కలర్ గౌను ధరించి అందులో ఎంతో అందంగా కనిపించారు. వైట్ కలర్ గౌను, బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని జుట్టును అలా వదిలేసి, బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఎంతో అందంగా కనిపించింది. స్నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.







