Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ఇన్స్టా పోస్ట్ వైరల్.. టెన్షన్ లో బన్నీ ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ ఉందో, అతని భార్యగా స్నేహా రెడ్డి(Sneha Reddy)కి సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను షేర్ చేసే స్నేహాను ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. తమ పిల్లల ఫోటోలు, వీడియోలతో పాటూ పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది స్నేహా.
అందుకే స్నేహా ఇన్స్టా అకౌంట్ కు, ఆమె పోస్టులకు సోషల్ మీడియాలో రీచ్ ఎక్కువ. కాగా తాజాగా స్నేహా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది హాస్పిటల్ లో ఒక అమ్మాయికి రక్తం ఎక్కిస్తున్న ఫోటోను షేర్ చేసి ప్రస్తుతం నాకు ఏం కావాలంటే అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది స్నేహా రెడ్డి. ఆమె పోస్ట్ చూసిన అల్లు ఫ్యాన్స్ ఏమైందా అని కంగారు పడుతున్నారు.
ఎప్పుడూ సరాదాగా ఫోటోలు, వీడియోలు, టిప్స్ ను షేర్ చేసే స్నేహా సడెన్ గా ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టిందని కొందరంటుంటే, అల్లు ఫ్యామిలీలో ఎవరికైనా బాలేదా అని మరికొందరు, ఇంకొందరు స్నేహాకు బాలేదు ఆ విషయాన్ని చెప్పడానికే హింట్ గా ఈ ఫోటోను పోస్ట్ చేసిందంటున్నారు. ఈ విషయంలో స్నేహా క్లారిటీ ఇస్తే కానీ ఏ విషయమూ తెలీదు.













