ఆహా వీక్షకులకు స్వదస్తూరితో అల్లు అరవింద్ కృతజ్ఞతలు
ప్రియమయిన కుటుంబ సభ్యులకు, అలా ఎందుకంటున్నాను అంటే ఈ రోజు ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు సంతోషంగాను, గర్వంగాను వుంది. మీ ప్రేమ ఆదరణ వల్ల ఈరోజు ఆహా మొదటి వార్షికోత్సవం చేసుకొంటున్నది. ఈ ఆహా కుటుంబంలో మన మందరము సభ్యులమేకదా! వినోదం అటే మనకు ఇష్టం-తెలుగు అంటే ఇంకా ఇష్టం. రెండు కలసిన ఈ ఆహాను విజయవంతంగా నడిపిస్తున్న మీకు మేము ఎంతయినా కృతజ్ఞలం. శ్రీజూపల్లి రామేశ్వరరావుగారికి, రాముగారికి, మాతోకలిసి నడిచే భాగస్వాములందరికీ ఇంత వేగంగా దీనిని తీసుకురావడానికి నిర్విరామంగా పనిచేసిన మా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
మీ ప్రేమతో అల్లు అరవింద్…













