పుష్ప2 రిలీజ్ విషయంలో తగ్గేదేలే!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప2. పుష్ప కు నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాను టీమ్ మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ రూపొందిస్తుంది. బడ్జెట్ పెరిగినా పర్లేదనుకుని నిర్మాతలు సుకుమార్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడిందనే వార్త ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయింది.
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనుకున్న టైమ్ కు కావని, సినిమాను వాయిదా వేయడం తప్పించి మరో మార్గం లేదని సుకుమార్, నిర్మాతలకు చెప్పాడని రకరకాల కథలల్లేశారు. కానీ ఈ వార్తల్లో అసలేమాత్రం నిజం లేదని తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా పుష్ప2 ఆగస్ట్ 15న రిలీజ్ కానుందని నొక్కి మరీ చెప్పారు.
ఎంత లేదన్నా పుష్ప2 రిలీజ్ కు ఇంకా 7 నెలల టైముంది. ఒక నెలను పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం వాడుకున్నా బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆరు నెలల టైముంది. సుకుమార్ అయితే సినిమాకు సమ్మర్ లోనే గుమ్మడి కాయ కొట్టాలని చూస్తున్నాడట. ఆ తర్వాత తీరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పుష్ప2 చెప్పిన టైమ్ కే రానుంది. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే!













