ఇంత లేటెందుకు బన్నీ?
పుష్ప సినిమాతో జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్పతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్న బన్నీ, తన తర్వాతి సినిమాలను స్టార్ డైరెక్టర్లతో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే కెరీర్ మొదట్లో తక్కువ టైమ్ లో సినిమాను పూర్తి చేసిన బన్నీ, ఇప్పుడు ఒక్కో సినిమాకు చాలా టైమ్ తీసుకోవడం ఫ్యాన్స్ కు సహించడం లేదు.
సరైనోడు సినిమా నుంచి ప్రతీ సినిమాకు మినిమం ఏడాది టైమ్ తీసుకుంటున్న బన్నీ, పుష్ప2 కోసం ఏకంగా 973 రోజులు టైమ్ తీసుకున్నాడు. పుష్ప వల్ల బన్నీకి క్రేజ్ పెరిగిన మాట నిజమే కానీ సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరి ఫ్యూచర్ లో అయినా బన్నీ తన సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేస్తాడా లేక ఇప్పటిలానే టైమ్ తీసుకుంటాడా అనేది చూడాలి. పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది కాకుండా బోయపాటితో సినిమా అంటున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా బన్నీ సినిమాను చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.













