ఆ విషయంలో తెలివిగా క్లారిటీ ఇచ్చిన బన్నీ
కొన్నాళ్ల కిందట బన్నీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు అలా ఎలా ఓకే చేశాడని ఫ్యాన్స్ అనుమానపడ్డారు. అర్జున్ రెడ్డి ఎంత క్లాసిక్ హిట్టయినా అందులో కమర్షియల్ హీరో నటించలేదు. పైగా ఫైట్లు లేవు. ఒక బోల్డ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన కుర్రాడి క్యారెక్టరైజేషన్ నచ్చి ఆ సినిమాను యూత్ బ్లాక్ బస్టర్ చేశారు.
అలాంటి సందీప్ రెడ్డి వంగకు బన్నీ ఎలా ఎస్ చెప్పాడు అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ ఆ అనుమానాలన్నింటినీ రీసెంట్ గా యానిమల్ మూవీకి రివ్యూ ఇచ్చి బన్నీ పటాపంచలు చేశాడు. ఈ సినిమాలోని నటీనటుల దగ్గర నుంచి టెక్నికల్ టీమ్ వరకు అందరి గురించి బన్నీ ప్రస్తావించాడు. బన్నీ ఇచ్చిన రివ్యూలో ప్రతీ లైన్ తాను సందీప్ కథకు ఎస్ చెప్పడం ఎంత గొప్ప నిర్ణయమో తెలియచేయడం అంతర్లీనంగా కనిపించింది.
అయితే సందీప్ బన్నీ కంటే ముందు ప్రభాస్ తో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఈ లోపు బన్నీ కూడా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసుకుంటాడు. త్రివిక్రమ్ మూవీ అయ్యే లోపు సందీప్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. ప్రభాస్ ను పోలీస్‌గా చూపించనున్న సందీప్, అల్లు అర్జున్ ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.













