అద్భుతమైన జంట ప్రయాణానికి పదేళ్లు..
స్నేహా రెడ్డిని.. బన్నీ ప్రేమంచి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్ వీరిద్దరికీ మరో ఇద్దరు. అల్లు అయాన్, అల్లు అర్హ. చూస్తుండగానే పెరిగి పెద్ధవాళ్లయి పోయారు. ఎప్పటికప్పుడు తన పిల్లల చిలిపి చేష్టల్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు చేరవేస్తుంటాడు బన్నీ.
ఇవాళ (మార్చి 6) అల్లు స్నేహ అర్జున్ లు పదవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శనివారం ఉదయం నుంచి #AlluArjun అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్లో ఉంది. దీన్ని క్లిక్ చేసిన చాలా మందికి ఇది అల్లు అర్జున్, స్నేహ జంట వివాహ వార్షికోత్సవం అని అర్థమై.. స్టైలిష్ స్టార్ అభిమానులు విషెస్ తెలిపారు. పదవ వార్షికోత్సవం ఇది ఎంతో అందమైనది క్యూటీ. ఎంతో అద్భుతమైన ప్రయాణం.. మెనీ మోర్ కమింగ్ అని అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తూ రెండు ఫోటోల్ని బన్నీ షేర్ చేశాడు. ఇందులో ఒక ఫోటో స్నేహ మెడలో మూడు ముడులు వేస్తున్న ఫోటో కాగా, ఇంకొకటి ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ కు ముందు వీరిద్దరూ నిలుచున్న ఫోటో. పుష్ప చిత్రీకరణలో బిజీగా ఉండి కూడా తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని ఇలా అభిమానులతో షేర్ చేసుకోవడం అందరికీ సంతోషాన్నిచ్చే విషయమే..













