శ్రీవారి సేవలో డీజే చిత్రబృందం
అద్భుతంగా నటించి విడుదలకు సిద్దమైన డిజె చిత్రం విజయవంతంగా ప్రదర్శించాలని కోరుతూ డిజె చిత్రటీమ్, నటుడు, అల్లుఅర్జున్ తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్రం విడుదలకుముందే నటుడు అల్లుఅర్జున్‌తో కలసి చిత్రంటీమ్ ముందుగానే జగద్విఖ్యాతిగాంచిన దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులకోసం వచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రంటీమ్ కొండకు చేరుకున్నారు. ఆలయంలోనికి చేరుకున్న వీరు ధ్వజస్తంభానికి మొక్కరు. అంతరాలయంలోకి చేరుకుని మూలవిరాట్టును దర్శించుకున్నారు. కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదలు అందజేశారు. ఈ టీమ్రాకతో తిరుమలలో అభిమానుల సందడి నెలకొంది.













