అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ ఖరారు!
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో హృద్యమైన కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమచారం. ఈ చిత్రానికి నాన్న నేను అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ తొలివారంలో ఈ చిత్రం సెట్స్ పైకి రానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.













