బన్నీ డ్యూయల్ రోల్!
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు పొక్కింది. దాని ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నారట. ఓ పాత్రలో బన్నీ ఉంగరాల జుత్తు, మాసిన గెడ్డం,తో మాస్ అండ్ డీగ్లామర్ లుక్లో లారీ డ్రైవర్గా నటిస్తుండగా, మరో పాత్రలో అతను కాస్టీ బిజినెస్ మెన్లా కన్పిస్తారట. ఈ రూమర్ ఇపుడు ఇండస్ట్రీలో కాక రేపుతోంది. ఇదే కనుక నిజమైతే బన్నీ మొదటిసారి డ్యూయల్ రోల్ చేసిన సినిమా మిగిలిపోనుంది. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.













