Allu Arjun: తెలుగోళ్లంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్

రీసెంట్ గా జరిగిన NATS 8th అమెరికా తెలుగు సంబరాల్లో ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. దీంతో ఈ ఈవెంట్ లో ఆయా సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు, వారు చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హాజరయ్యారు. వేదికపై బన్నీ(Bunny)ను తానా స్పెషల్ గా సన్మానించింది.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా వైల్డ్ ఫైర్ అని స్టైల్ గా డైలాగ్ చెప్పాడు. ఈ ఈవెంట్ కు ఎప్పుడు హాజరైనా తాను షాకవుతూ ఉంటానని, ఇంతమంది తెలుగు వాళ్లను వేరే దేశంలో చూస్తుంటే హైదరాబాద్, వైజాగ్ లో ఉన్నట్టే అనిపిస్తుందని, మన తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నాడు బన్నీ.
ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే అని, అందులో తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే అని అల్లు అర్జున్ అనడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో హోరెత్తిపోయింది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్(sun pictures) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది.