పుష్ప2 గురించి బన్నీ చెప్తుంది చాలా తక్కువట
మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టు గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన స్పీచ్ లో పుష్ప2 గురించి మాట్లాడి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని, ఈవెంట్‌కు నేరుగా అక్కడి నుంచే వస్తున్నానని చెప్పాడు.
అంతేకాదు, పుష్ప2లో ప్రస్తుతం జాతరకు సంబంధించిన ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నట్లు, అందుకే తన చేతికి నెయిల్ పాలిష్ గుర్తులున్నాయని, చెప్పుకొచ్చాడు. పుష్ప2లో ఈ జాతర సీన్ చాలా కీలకమైన ఎపిసోడ్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప2 ఫస్ట్ లుక్‌లో బన్నీ ఆడవేషంలో కనిపించింది ఈ జాతర ఎపిసోడ్లో భాగంగానే.
అయితే జాతర గురించి బన్నీ చెప్పింది చాలా తక్కువని, వాస్తవానికి ఈ ఎపిసోడ్‌ను వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య పుష్పరాజ్ గ్రామ సాంప్రదాయం ప్రకారం, వేషం వేసుకుని పాటకు డ్యాన్స్ చేస్తూ, శత్రువులను సంహరిస్తాడని, ఈ సీన్ ను సుకుమార్ ఫ్యాన్స్ కు గూస్బంప్స్ వచ్చేలా తీస్తున్నాడని టాక్. అయితే ఈ జాతర సీన్ ఇంటర్వెల్ కు ముందొస్తుందా లేదా క్లైమాక్స్ సీనా అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













