సైరాకు అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ?
సీనియర్ నటుడు చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటగాథ ఆధారంగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి హీరో అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందని, దీనికి అల్లు అర్జున్ వాయిస్ అయితేనే బాగుంటుందని దర్శకుడు సురేందర్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షులకు ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.













