క్రిస్మస్ కానుకగా పుష్ప
అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప 1 ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగల సందర్భంగా పుష్ప ద రైజ్ థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే విడుదల చేశారు దర్శక నిర్మాతలు.













