అల్లు అర్జున్ కనబడుట లేదు!
మాస్, కమర్షియల్, ఇమేజ్ ఇలాంటి లెక్కల్ని పక్కన పెట్టడానికి మన కథానాయకులు ఇప్పుడిప్పుడే సిద్ధపడుతున్నారు. దాంతో కొత్త రకమైన సినిమాల్ని చూసే అవకాశం దక్కుతోంది. కథలెప్పుడైతే మారుతున్నాయో, విభిన్నమైన టైటిళ్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ ఖరారు చేశారు. కనబడుటలేదు అనేది ఉపశీర్షిక. అల్లు అర్జున్ కథానాయకుడిగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు. దిల్‌రాజు సంస్థలో అల్లు అర్జున్ నటిస్తున్న నాలుగో చిత్రమిది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలొచ్చాయి. కాగా త్రివిక్రమ్‌తో కలిసి అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ నెల 24 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.













