అల వైకుంఠపురములో ఫస్ట్‌లుక్ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో తొలి ప్రచార చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరక్కెనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.













