Allu Arjun : శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ (Sritej ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) పరామర్శిచారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ (kims hospital ) కు చేరుకున్న అల్లు అర్జున్ అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా ఉన్నారు. కాగా, అల్లు అర్జున్ హాస్పిటల్ రావడంతో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొదని లీగల్ టీమ్ చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆస్పుత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు.













