Allu Arjun: రాజీపడను, నా గురించి అందరికి తెలుసు: అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం.. ఇది ఒక యాక్సిడెంట్ అన్నారు సినీ హీరో అల్లు అర్జున్ (Allu arjun). సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అర్జున్… ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా అని ఆవేదన వ్యక్తం చేసారు. సినిమాకు వచ్చేవారిని ఎంటర్టైన్ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను అన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదన్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా అని నిలదీశారు. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి.. మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లానన్నారు. నేను పోలీసుల డైరెక్షన్లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్ క్లియర్ చేశారని తెలిపారు. నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారన్నారు.
థియేటర్లో ఏ పోలీస్ నన్ను కలవలేదు.. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయానని రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది.. నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదన్నారు అల్లు అర్జున్. తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారని అల్లు అర్జున్ వివరించాడు. వాళ్లను కలవాలని నాకు ఉండదా? అని ప్రశ్నించారు. న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయనే వెళ్లలేదన్నాడు. ఆ తర్వాత ఒక వీడియో పెట్టాను, డబ్బులు ఇస్తానని చెప్పానని… ఆ అబ్బాయి ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం.. నేను తండ్రిని కాదా.. నాకు అంతే వయస్సున్న కొడుకు ఉన్నాడన్నాడు బన్నీ.
ఎవరో చనిపోతే.. నేను వెళ్లాను.. నా ఫాన్స్ చనిపోతే వెళ్లనా అని ప్రశ్నించాడు. నిర్మాత బన్నీవాసు రావొద్దంటేనే నేను పరామర్శకు వెళ్ళలేదని తెలిపాడు. సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసా… నేను ఆఫ్ లో వున్నా… నేను స్ట్రాంగ్ పర్సన్.. కానీ ఫాల్స్ ఎలిగేషన్ అని కొట్టిపారేశాడు. తెలుగోడిని నిలబెట్టాలని నా ప్రయత్నం… మనమే లాక్కుంటున్నాం… ఎవరిని బ్లేమ్ చెయ్యాలని అనుకోవడం లేదన్నాడు. అభిమానులను చంపుకోవాలని నాకు ఉంటుందా అని ప్రశ్నించాడు. ఇక అల్లు అర్జున్ వెంట లాయర్ అశోక్ రెడ్డి, అతని తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు.













