KGF చాప్టర్ 2 రాకీ భాయ్‌పై పుష్పరాజ్ అల్లు అర్జున్ ప్రశంసలు
అల్లు అర్జున్ తాజాగా కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని వీక్షించినట్టున్నాడు. ఇక సినిమాను చూసిన బన్నీ.. యష్ నటనకు, ప్రశాంత్ నీల్ విజన్‌కు ఫిదా అయినట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ఏదైనా సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తాడు. ఆ చిత్రయూనిట్‌ను ప్రశంసిస్తాడు. తాజాగా బన్నీ కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాను వీక్షించాడు. అనంతరం సినిమా యూనిట్ మీద ప్రశంసలు కురిపించారు. స్వాగ్, ఇంటెన్సిటీతో యష్ నటించాడని ప్రశంసించాడు. రవి బస్రూర్ సంగీతం, భువన గౌడ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందన్నాడు.
ప్రశాంత్ నీల్ విజన్ అద్భుతంగా ఉందని పొగిడేశాడు. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిలతో పాటు సినిమా యూనిట్ అంతటికీ కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.మొత్తానికి బన్నీ వేసిన ట్వీట్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలే మన తెలుగు హీరోలు ఇంత వరకు సోషల్ మీడియా వేదికగా చాప్టర్ 2 సినిమాను పొగడలేదు. సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించినా కూడా ఎక్కడా ఎవ్వరూ స్పందించలేదు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం.. ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి వారు ఫోన్ చేశారంటూ తన ప్రమోషన్లలో చెప్పేశాడు. ఇక ఇప్పుడు బన్నీ వేసిన ట్వీట్ మీద చాప్టర్ 2 యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే శ్రీనిధి శెట్టి స్పందించింది. థ్యాంక్యూ సర్ అని రిప్లై ఇచ్చేసింది.
https://twitter.com/alluarjun/













