మరో మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్న బన్నీ
ఇప్పుడు హీరోల దృష్టంతా సినిమాలతో పాటూ ఇతరత్రా బిజినెస్‌లపై కూడా ఉంది. కోట్లలో వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసే వాప్యారాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ అంటూ ఒక్కొక్కరు ఒక్కో రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తున్నారు.
రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఏఏ మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీతో ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు బన్నీ మరో మల్టీప్లెక్స్ ను వైజాగ్‌లో నిర్మించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసమే రీసెంట్గా విశాఖ సాగరతీరంలో ఏడెకరాల స్థలం కొన్నట్లు సమాచారం.
ఇస్కాన్ టెంపుల్, మరో రెండు స్టార్ హోటల్స్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లోనే బన్నీ ప్లేస్ ను కొన్నాడని తెలుస్తోంది. ఏఏఏ పేరుతోనే అక్కడ కూడా ఓ భారీ మల్టీప్లెక్స్ ను బన్నీ నిర్మించనున్నాడని, విశాఖలో భవిష్యత్ బాగుంటుందని ఆలోచించే బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరి ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఎప్పుడు కార్యాచరణలోకి వస్తుందో చూడాలి.













