500 మంది డ్యాన్సర్లతో బన్నీ మాస్ జాతర
టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ లో టాప్ లో ఉంటాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మాస్ స్టెప్పులేయడంలో అల్లు అర్జున్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ గత కొన్ని సినిమాలుగా బన్నీ మాస్ స్టెప్పులేయడం లేదనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. బన్నీ డ్యాన్సులేస్తున్నాడు కానీ అవి స్టైలిష్ గా ఉంటున్నాయి తప్పించి మాస్ గా ఉండటం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
డీజే సినిమా నుంచి బన్నీ మాస్ స్టెప్పులేయడం లేదని బన్నీ డ్యాన్స్ విషయంలో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఇదిలా మాస్ లోకి వెళ్లాలని చూస్తున్న బన్నీ, ఇప్పుడు పుష్ప2 సినిమాలో మాస్ స్టెప్పులేయడానికి రెడీ అవుతున్నాడట. డ్యాన్సులపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట బన్నీ. రీసెంట్ గా పుష్ప2 షెడ్యూల్ లో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో జాతర గెటప్స్ తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మందికి పైగా డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేశారట.
ఈ పాటలో బన్నీ ఊర మాస్ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉంటాయని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతుంది. బన్నీ ఎనర్జీని మ్యాచ్ చేసేలా ఈ సాంగ్ ను గణేష్ ఆచార్య కంపోజ్ చేశాడట. జాతర పాటలో బన్నీ ఊర మాస్ జాతర కనిపించనుందని, ఈ సాంగ్ మాస్ ఫ్యాన్స్ ను బాగా అలరిస్తుందని చెప్తున్నారు.













